కాపీరైట్, ట్రేడ్‌మార్క్ ఫిర్యాదులు
మీ పనిని కాపీ చేసిన దాన్ని, లేదా మీ పర్మిషన్ లేకుండా మీ బ్రాండ్ వాడిన దాన్ని Sagazo నుంచి తీసేయమని ఎలా అడగాలో ఈ పేజీ చెబుతుంది.
ఈ పేజీ ఇంగ్లీష్‌లో ఉన్న కాపీరైట్, ట్రేడ్‌మార్క్ ఫిర్యాదుల పేజీకి తెలుగు అనువాదం. చదవడానికి వీలుగా ఉంటుందని ఇచ్చాం. రెండింటిలో ఎక్కడైనా తేడా ఉంటే, ఇంగ్లీష్ వెర్షనే చెల్లుతుంది.
Sagazoలో ఏదైనా మీ పనిని కాపీ చేస్తే, దాన్ని తీసేయమని మమ్మల్ని అడగొచ్చు. మీ ఫోటోలు, వీడియోలు, రాతలు, మ్యూజిక్, డిజైన్లు, ఏదైనా సరే. మీవి కాని ప్రోడక్ట్స్ మీద మీ బ్రాండ్ పేరు గానీ లోగో గానీ పెడితే కూడా అడగొచ్చు. మాకు ఏం పంపాలో, తర్వాత ఏం జరుగుతుందో ఈ పేజీ చెబుతుంది.
మీ నోటీసులో ఉండాల్సినవి
- మీ పేరు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఒక ఇమెయిల్ అడ్రస్. ఫోన్ నంబర్ కూడా ఇస్తే ఇంకా మంచిది.
- కాపీ అయిన మీ పని, లేదా మీ ట్రేడ్‌మార్క్, దాని రిజిస్ట్రేషన్ నంబర్. అది మీదే అని, లేదా దానికి ఎక్స్క్లూసివ్ లైసెన్స్ మీ దగ్గర ఉందని చూపించే రుజువు కూడా.
- Sagazoలో మీ పని గానీ బ్రాండ్ గానీ వాడిన ప్రతి పోస్ట్, ప్రోడక్ట్, ప్రొఫైల్, లేదా ఇంకో చోటుకి లింక్.
- అది ఎందుకు ఉల్లంఘనో, చట్టంలోని ఏ మినహాయింపూ దానికి ఎందుకు వర్తించదో. ఉదాహరణకి రివ్యూ, విమర్శ, వార్తల కోసం న్యాయంగా వాడుకోవడం (ఫెయిర్ డీలింగ్).
- అది పోస్ట్ చేసినవాళ్ళ పేరు గానీ ప్రొఫైల్ గానీ, మీకు తెలిస్తే.
- మీ నోటీసులోని వివరాలు నిజమే అని మీ డిక్లరేషన్.
ఎలా పంపాలి
మా కాంటాక్ట్ ఫామ్‌లో "కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ ఫిర్యాదు" ఆప్షన్ వాడండి. లేదా మా ఫిర్యాదుల అధికారి Phanindra Veeraకి [email protected]లో ఇమెయిల్ చేయండి. ఫామ్ వాడితే మీకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది.
తర్వాత ఏం జరుగుతుంది
- మీ నోటీసు అందిందని 24 గంటల్లో చెబుతాం.
- మీ నోటీసు పూర్తిగా ఉండి, ఉల్లంఘన ఉందని చూపిస్తే, ఆ కంటెంట్ తీసేస్తాం. లేదా అది ఎవరికీ కనిపించకుండా బ్లాక్ చేస్తాం.
- ఏం తీసేశామో, ఎందుకో, ఎవరు ఫిర్యాదు చేశారో, అది పోస్ట్ చేసినవాళ్ళకి చెబుతాం.
- దాన్ని పోస్ట్ చేసే హక్కు తమకు ఉందని వాళ్ళు అనుకుంటే, రుజువుతో జవాబు ఇవ్వొచ్చు. అప్పుడు మేము దాన్ని మళ్ళీ పెట్టొచ్చు. కోర్టు వద్దని చెబితే మాత్రం పెట్టం.
కొన్ని నోటీసులు Sagazoలో కొంచెం సేపు మాత్రమే దాచి ఉండే కాపీల గురించి ఉంటాయి. కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 52(1)(c) ఇలాంటి కాపీల గురించి చెబుతుంది. వాటి విషయంలో, కాపీరైట్ రూల్స్, 2013 ప్రకారం ఈ విషయాన్ని కోర్టుకి తీసుకెళ్తానని మీరు నోటీసులో మాట ఇవ్వాలి. 21 రోజుల్లో కోర్టు ఆర్డర్ మాకు పంపాలి. ఆ టైమ్‌లో ఆర్డర్ రాకపోతే, ఆ కంటెంట్ మళ్ళీ రావచ్చు.
మళ్ళీ మళ్ళీ ఉల్లంఘించేవాళ్ళు
ఇతరుల పనిని మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేసే అకౌంట్ Sagazo వాడే అవకాశం పోగొట్టుకుంటుంది. నకిలీ బ్రాండెడ్ వస్తువులు మళ్ళీ మళ్ళీ అమ్మే అకౌంట్ కూడా.
దీన్ని తప్పుగా వాడకండి
మీ సొంత పని గానీ బ్రాండ్ గానీ అయితేనే నోటీసు పంపండి. లేదా ఎవరి తరఫున పని చేసే అధికారం మీకు ఉందో, వాళ్ళ పని గానీ బ్రాండ్ గానీ అయితే. తప్పుడు నోటీసు, లేదా ఒకరి నోరు మూయించడానికి పంపిన నోటీసు చట్టానికి వ్యతిరేకం కావచ్చు. అలాంటి నోటీసుని మేము తిరస్కరించొచ్చు.
© 2026 Proper Eleven Technologies Pvt Ltd. అన్ని హక్కులు రిజర్వ్.