ఫిర్యాదులు, వాటి పరిష్కారం
Sagazoలో ఏదైనా సమస్య గురించి మాకు ఎలా చెప్పాలి, మేము ఎంత త్వరగా చర్య తీసుకుంటాం, మా జవాబు నచ్చకపోతే మీరు ఏం చేయొచ్చు అనేది ఈ పేజీ చెబుతుంది.
ఈ పేజీ ఇంగ్లీష్‌లో ఉన్న ఫిర్యాదుల పేజీకి తెలుగు అనువాదం. చదవడానికి వీలుగా ఉంటుందని ఇచ్చాం. రెండింటిలో ఎక్కడైనా తేడా ఉంటే, ఇంగ్లీష్ వెర్షనే చెల్లుతుంది.
Sagazoలో దేని గురించైనా మాకు ఫిర్యాదు చేయొచ్చు: పోస్ట్, కామెంట్, ప్రొఫైల్, సర్కిల్, షాప్, ప్రోడక్ట్, చాట్ మెసేజ్. మీ అకౌంట్ గురించి మేము తీసుకున్న నిర్ణయం మీద కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఏ రకం ఫిర్యాదు ఎక్కడికి పంపాలో, మేము ఎంత త్వరగా చర్య తీసుకుంటామో ఈ పేజీ చెబుతుంది. మా జవాబు మీకు నచ్చకపోతే ఏం చేయొచ్చో కూడా చెబుతుంది.
ఉన్న చోటే రిపోర్ట్ చేయండి
అన్నిటికంటే త్వరగా అయ్యే దారి, దాన్నే రిపోర్ట్ చేయడం. దాని పక్కన ఉన్న ⋯ మెనూ గానీ జెండా గుర్తు గానీ నొక్కి, "రిపోర్ట్ చేయండి" ఎంచుకోండి. సరిగ్గా సరిపోయే కారణం ఎంచుకోండి. పనికొస్తుందనిపిస్తే ఒక నోట్ కూడా రాయండి. ప్రతి రిపోర్ట్‌ని మేము చూస్తాం, ఏం నిర్ణయించామో మీకు చెబుతాం. మీరు రిపోర్ట్ చేసిన మనిషికి, రిపోర్ట్ చేసింది మీరే అని మేము ఎప్పుడూ చెప్పం.
వెంటనే చూడాల్సిన ఫిర్యాదులు
ఇలాంటి సందర్భాల్లో మా కాంటాక్ట్ పేజీలోని సేఫ్టీ ఫామ్ వాడండి:
- మీ ప్రైవేట్ భాగాల్ని చూపించే, మిమ్మల్ని బట్టలు లేకుండా లేదా సెక్స్ చేస్తున్నట్టు చూపించే ఫోటో గానీ వీడియో గానీ ఎవరైనా షేర్ చేస్తే. మీలా కనిపించేలా మార్ఫ్ చేసినది అయినా సరే.
- ఎవరైనా మీలా నటిస్తుంటే.
- ఏదైనా పిల్లలకి ప్రమాదం తెస్తుంటే.
వీటి మీద 2 గంటల్లో చర్య తీసుకుంటాం. మీ తరఫున వేరే ఎవరైనా కూడా ఫిర్యాదు పంపొచ్చు.
ఎవరి ప్రాణానికైనా ఇప్పుడే ప్రమాదం ఉంటే, 112కి కాల్ చేయండి. పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ నంబర్ 1098కి కూడా కాల్ చేయొచ్చు.
ఏదైనా తీసేయమని అడగడం
Sagazoలో ఏదైనా చట్టానికి గానీ మా కమ్యూనిటీ గైడ్లైన్స్కి గానీ వ్యతిరేకంగా ఉంటే, లింక్‌లతో సహా తీసేయమని అడిగే ఫామ్ ద్వారా పంపండి. సెక్స్ కంటెంట్, వేధింపులు, ద్వేషం, పిల్లలకి హాని చేసేది ఏదైనా, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. తప్పుడు, తప్పుదారి పట్టించే కంటెంట్, ఎవరిలాగో నటించడం కూడా. ఇండియా భద్రతకి గానీ శాంతిభద్రతలకి గానీ ముప్పు, హాని చేసే సాఫ్ట్వేర్, జూదం, డబ్బు పెట్టి ఆడే గేమ్స్ కూడా. దాని మీద 36 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం.
ఎవరైనా మీ పనిని కాపీ చేస్తే, లేదా మీ బ్రాండ్ వాడితే, కాపీరైట్, ట్రేడ్‌మార్క్ ఫిర్యాదులు చూడండి.
ఇంకే ఫిర్యాదైనా
ఇంకేదైనా అయితే, మా ఫిర్యాదుల అధికారికి (గ్రీవెన్స్ ఆఫీసర్) కాంటాక్ట్ ఫామ్ ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ రాయండి. ఏం జరిగిందో చెప్పండి, లింక్‌లు పెట్టండి. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా చెప్పండి.
మేము ఎంత త్వరగా చర్య తీసుకుంటాం
- ప్రతి ఫిర్యాదు అందిందని 24 గంటల్లో చెబుతాం. 7 రోజుల్లో పరిష్కరిస్తాం.
- చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది తీసేయమని అడిగితే, 36 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం.
- మీ ప్రైవేట్ ఫోటో, మార్ఫ్ చేసిన మీ ఫోటో, లేదా మీలా ఎవరైనా నటించడం, వీటి మీద 2 గంటల్లో చర్య తీసుకుంటాం.
కాంటాక్ట్ ఫామ్ ద్వారా ఫిర్యాదు పంపగానే మీకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు సైన్ ఇన్ అయి ఉంటే, మీకు ఒక నోటిఫికేషన్ కూడా పంపుతాం.
మీది ఏదైనా మేము తీసేస్తే
మీరు షేర్ చేసింది మేము తీసేసినా, మీ అకౌంట్‌కి హెచ్చరిక పంపినా, సస్పెండ్ చేసినా, బ్యాన్ చేసినా, ఆ నిర్ణయం మీ అకౌంట్ స్టేటస్ పేజీలో ఉంటుంది. ఏ నియమం ప్రకారం, ఏ కారణంతో అనేది కూడా అక్కడే ఉంటుంది. నిర్ణయం వచ్చిన 30 రోజుల్లోపు "రివ్యూ అడగండి" నొక్కండి. వీలైనప్పుడు, ఆ నిర్ణయం తీసుకోని వేరే మనిషి దాన్ని చూస్తారు. 7 రోజుల్లో జవాబిస్తాం. మీరు సైన్ ఇన్ చేయలేకపోతే, సైన్ ఇన్ స్క్రీన్లోనే నిర్ణయం, రివ్యూ అడగడానికి లింక్ కనిపిస్తాయి.
మా జవాబు మీకు నచ్చకపోతే
మా జవాబు వచ్చిన 30 రోజుల్లోపు ఫిర్యాదుల అప్పీలు కమిటీకి (గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ) అప్పీల్ చేయొచ్చు. దానికి gac.gov.inకి వెళ్ళండి. Sagazo లాంటి ప్లాట్‌ఫామ్‌ల నిర్ణయాల మీద అప్పీళ్ళు వినడానికి ప్రభుత్వం ఈ కమిటీని పెట్టింది.
మోసంలో డబ్బు పోగొట్టుకుంటే, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి.
మా ఫిర్యాదుల అధికారి
Phanindra Veera, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఇమెయిల్: [email protected]
Proper Eleven Technologies Private Limited, 501 Sarojini Heights, Kanuru, Amaravati Colony, Vijayawada, Andhra Pradesh 520007, India
పోలీసులు, కోర్టులు, ప్రభుత్వం కోసం
పోలీసులు, కోర్టులు, ప్రభుత్వ శాఖలు తమ ఆర్డర్లు, రిక్వెస్ట్‌లు పైన ఉన్న ఇమెయిల్ అడ్రస్‌లో మా ఫిర్యాదుల అధికారికి పంపొచ్చు. చట్టం పెట్టిన టైమ్‌లోగా వాటి మీద చర్య తీసుకుంటాం.
© 2026 Proper Eleven Technologies Pvt Ltd. అన్ని హక్కులు రిజర్వ్.