మీకు రీసెట్ లింక్ అక్కర్లేదు. బదులుగా ఒక్కసారి వాడే కోడ్‌తో లాగిన్ అవ్వండి. తర్వాత Settings (సెట్టింగ్స్) పేజీలో కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోండి. దానికి మీ పాత పాస్‌వర్డ్ అక్కర్లేదు.
కోడ్‌తో లాగిన్ అవ్వండి
- మీ మొబైల్ నంబర్ టైప్ చేసి, Continue (కొనసాగించండి) నొక్కండి.
- పాస్‌వర్డ్ అడిగే స్టెప్‌లో Log in with OTP instead (బదులుగా OTPతో లాగిన్ అవ్వండి) నొక్కండి.
- మేము SMSలో పంపే 6 అంకెల కోడ్ టైప్ చేయండి.
కోడ్‌తో లాగిన్ అయితే మీ పాస్‌వర్డ్ ఎప్పుడూ మారదు, పోదు. అందుకే పాతది తర్వాత గుర్తొస్తే, అది ఇంకా పని చేస్తుంది.
కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోండి
వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్ తెరిచి (మెనూలో మీ పేరు), Settings నొక్కండి. తర్వాత Privacy (ప్రైవసీ) ట్యాబ్ తెరవండి. Password (పాస్‌వర్డ్) పక్కన Change (మార్చండి) నొక్కండి. కొత్త పాస్‌వర్డ్ రెండుసార్లు టైప్ చేసి, Update password (పాస్‌వర్డ్ అప్‌డేట్ చేయండి) నొక్కండి.
యాప్‌లో మెనూ నుంచి గానీ, మీ ప్రొఫైల్‌లోని గేర్ గుర్తు నుంచి గానీ Settings తెరవండి. తర్వాత Privacy కింద ఉన్న Password నొక్కండి.
పాస్‌వర్డ్ రూల్
- కనీసం 8 అక్షరాలు
- ఒక క్యాపిటల్ లెటర్, A నుంచి Z
- ఒక అంకె, 0 నుంచి 9
రెండు బాక్సుల్లో ఒకటే ఉండాలి. ఇంకెక్కడా వాడని పాస్‌వర్డ్ పెట్టుకోండి. ముఖ్యంగా మీ ఇమెయిల్‌కి గానీ బ్యాంక్‌కి గానీ వాడేది అస్సలు పెట్టకండి.