నేరుగా ముఖ్య భాగానికి వెళ్ళండి

షాప్‌కి మెసేజ్ చేయడం

అప్‌డేట్ చేసింది

షాప్ పేజీలోని Message (మెసేజ్ చేయండి) బటన్‌తో ఆ షాప్‌కి మెసేజ్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ గురించి, సైజు గురించి, రంగు గురించి అడగొచ్చు. దానికి లాగిన్ అయి ఉండాలి. కానీ షాప్ నడిపేవాళ్ళకి మీరు ఫ్రెండ్ అయి ఉండక్కర్లేదు.

షాప్ పేజీ నుంచి

Follow (ఫాలో అవ్వండి) పక్కన ఉన్న Message నొక్కండి.

  • వెబ్‌సైట్‌లో పేజీ కింద కుడి వైపు ఒక చిన్న చాట్ బాక్స్ తెరుచుకుంటుంది. ఫోన్‌లో అయితే అది స్క్రీన్ మొత్తం తెరుచుకుంటుంది. అందులో మాటలు మాత్రమే పంపగలరు. ఫోటో గానీ వాయిస్ నోట్ గానీ పంపాలంటే, బాక్స్ పైన ఉన్న బాణం గుర్తులు నొక్కి ఆ చాట్‌ని Chat (చాట్)లో తెరవండి.
  • యాప్‌లో చాట్ తెరుచుకుంటుంది.

ప్రోడక్ట్ నుంచి

ప్రోడక్ట్ పేజీలో Message బటన్ ఉండదు. షాప్ పేరు ఉన్న Sold by (అమ్మేది) లైన్ నొక్కితే షాప్ పేజీ తెరుచుకుంటుంది. అక్కడ Message నొక్కండి.

Sold by Sagazo (అమ్మేది Sagazo) అని ఉన్న ప్రోడక్ట్‌కి మెసేజ్ చేయడానికి షాప్ ఉండదు. దాని గురించి అడగాలంటే, Sagazo సపోర్ట్‌కి రాయండి.

ఆర్డర్ నుంచి

మీరు ఆ షాప్ నుంచి ఆర్డర్ చేసి ఉంటే, ఆర్డర్ తెరిచి, Sold by కింద ఆ షాప్ కోసం ఉన్న Message నొక్కండి. వెబ్‌సైట్‌లో మీ ఆర్డర్లు మెనూలో My orders (నా ఆర్డర్లు) కింద ఉంటాయి. యాప్‌లో మెనూ నుంచి Orders (ఆర్డర్లు) తెరవండి. షాప్ పేజీలోని Message బటన్ తెరిచే చాట్ కూడా ఇదే.

మీరు ఎవరితో మాట్లాడుతున్నారు

చాట్ ఆ షాప్ నడిపేవాళ్ళతో జరుగుతుంది. మీ చాట్‌ల లిస్ట్‌లో దాని మీద షాప్ పేరు కాదు, వాళ్ళ పేరు ఉంటుంది. షాప్ పేజీలో Run by (నడిపేది) కింద ఆ పేరు కనిపిస్తుంది. ఆ మనిషితో మీకు ఇప్పటికే చాట్ ఉంటే, Message అదే చాట్ తెరుస్తుంది.

షాప్‌తో కొత్త చాట్ కూడా, గంటలో మీరు మొదలుపెట్టగలిగే 10 కొత్త చాట్‌ల లెక్కలోకి వస్తుంది. మీలో ఎవరైనా ఇంకొకరిని బ్లాక్ చేసి ఉంటే, Sagazo "You can't message this person." (మీరు ఈ మనిషికి మెసేజ్ చేయలేరు.) అని చెబుతుంది. మీలో ఒకరు ఇంకొకరి షాప్ నుంచి ఆర్డర్ కోసం ఎదురుచూస్తుంటే, ఆ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు గానీ క్యాన్సిల్ అయ్యే వరకు గానీ ఆ చాట్ ఓపెన్‌గా ఉంటుంది.

ఎవరికైనా డబ్బు కట్టే ముందు

మేము వెరిఫై చేయక ముందే ఒక షాప్‌కి మెసేజ్ చేయొచ్చు. UPI, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా పేమెంట్ లింక్ ద్వారా నేరుగా తమకే డబ్బు కట్టమని షాప్ అడిగితే, అది చాలా స్కామ్‌లలో కనిపించే గుర్తు. చూడండి: స్కామ్‌లను గుర్తుపట్టడం.

మీరు షాప్ నడుపుతుంటే, కొనేవాళ్ళ మెసేజ్‌లు మిగతా చాట్‌ల లాగే మీ సొంత Chatలోకి వస్తాయి. చూడండి: ఆర్డర్ గురించి కొనేవాళ్ళకి మెసేజ్ పంపడం.

ఇంకా తేలలేదా?

మాకు మెసేజ్ చేయండి, ఒక మనిషి జవాబు ఇస్తారు

ఏం జరిగిందో చెప్పి, లింక్‌లు ఉంటే జోడించండి, జవాబు ఇచ్చే ముందు మేము చూస్తాం. మీ ప్రైవేట్ ఫోటో లాంటి అర్జెంట్ విషయాలు సేఫ్టీ ఫామ్ ద్వారా పంపండి.

మాకు మెసేజ్ చేయండి

మళ్ళీ కనెక్ట్ అవుతోంది…

ఇప్పుడే మళ్ళీ వస్తాం.