ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే, మీ షాప్ కన్సోల్‌లో Products పేజీ తెరిచి Add a product నొక్కండి. పేజీ పైన ఒక ఫారం తెరుచుకుంటుంది. ప్రోడక్ట్ అమ్మకానికి రావడానికి పేరు, కేటగిరీ, ధర, ఒక ఫోటో చాలు. ఫారంలో మిగతావన్నీ అది అమ్ముడవ్వడానికి, డెలివరీ అవ్వడానికి సాయపడతాయి.

ఫారం, పై నుంచి కింద వరకు

- Name (పేరు). కస్టమర్‌కి మీరు ఏమని చెబుతారో అదే, ఉదాహరణకి కాంచీపురం పట్టు చీర.
- Category (కేటగిరీ), Subcategory (సబ్ కేటగిరీ). ముందు మెయిన్ కేటగిరీ ఎంచుకోండి, తర్వాత దాని కింద ఉన్న కచ్చితమైనది. రెండూ కావాలి. ప్రోడక్ట్ ఏ బ్రౌజ్ పేజీల్లో కనిపిస్తుందో ఇవి తేలుస్తాయి. చూడండి: కేటగిరీ ఎలా ఎంచుకోవాలి.
- Price (ధర), రూపాయల్లో. డెలివరీ కాకుండా, ఒక యూనిట్‌కి కొనేవాళ్ళు కట్టేది.
- Sold per (ఏ యూనిట్‌లో అమ్ముతారు). ధర పక్కన కొనేవాళ్ళకి కనిపించే యూనిట్: పీస్, కిలో, గ్రాము, లీటర్, ఎంఎల్, ప్యాక్, డజన్, సెట్ లేదా మీటర్.
- Description (వివరణ). అది ఏమిటి, దేనితో చేశారు, ఎలా చూసుకోవాలి, కనీసం 100 అక్షరాల్లో. చూడండి: ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎలా రాయాలి.
- Photos (ఫోటోలు). వీడియోలు పెట్టగలిగినప్పుడు ఇది Photos and videos (ఫోటోలు, వీడియోలు) అని ఉంటుంది. మొత్తం 5 వరకు పెట్టొచ్చు, మొదటిది కవర్ ఫోటో అవుతుంది. చూడండి: ప్రోడక్ట్ ఫోటోలు.
- Sizes (సైజులు). ప్రోడక్ట్ సైజుల్లో వస్తే తప్ప దీన్ని ముట్టుకోకండి. చూడండి: సైజులు, స్టాక్.
- Manufacturer or packer (తయారు చేసినవాళ్ళు లేదా ప్యాక్ చేసినవాళ్ళు), ప్రోడక్ట్ వివరాల టేబుల్, షిప్పింగ్ వివరాలు (బరువు, HSN కోడ్, బాక్స్ సైజు). వీటిలో ఒక్కోదానికి ఈ సెక్షన్‌లో ఒక పేజీ ఉంది.
Add product నొక్కండి. అప్పుడే ఫోటోలు అప్‌లోడ్ అవుతాయి. అందుకే ప్రోడక్ట్ సేవ్ అయిందని చెప్పేవరకు పేజీ తెరిచే ఉంచండి.
తర్వాత ఏమవుతుంది
మీ షాప్ వెరిఫై అయి ఉంటే, ప్రోడక్ట్ వెంటనే మీ షాప్ పేజీలో ఉంటుంది. క్షణంలో దాని కేటగిరీ పేజీల్లో, ఫీడ్‌లో కూడా వస్తుంది. మీ షాప్ ఇంకా రివ్యూలో ఉంటే, మేము షాప్ వెరిఫై చేసేవరకు అది మీకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత అదే లైవ్ అవుతుంది. చూడండి: షాప్ వెరిఫై అయ్యేవరకు మీ ప్రోడక్ట్స్ ఎందుకు కనిపించవు.
ప్రతి ప్రోడక్ట్‌కి దాని పేరుతో ఒక సొంత వెబ్ అడ్రస్ వస్తుంది. చూడండి: మీ ప్రోడక్ట్ వెబ్ అడ్రస్ ఎలా వస్తుంది.
తర్వాత మార్చాలంటే
Products పేజీలో, ప్రోడక్ట్ పక్కన Edit నొక్కండి. అదే ఫారం సైజులు తప్ప అన్నీ నింపి ఉన్నట్టు తెరుచుకుంటుంది, కింద బటన్ Save changes అని ఉంటుంది. అక్కడ మీరు తీసేసిన ఫోటోలు మా స్టోరేజ్ నుంచి కూడా డిలీట్ అవుతాయి, ఉత్తినే దాచడం కాదు. సైజులు మార్చాలంటే, ప్రోడక్ట్ పక్కన Sizes నొక్కండి.