నేరుగా ముఖ్య భాగానికి వెళ్ళండి

క్యాన్సిల్ అయిన ఆర్డర్లు, స్టాక్ ఏమవుతుంది

అప్‌డేట్ చేసింది

మీరు ఆర్డర్‌ని డిస్పాచ్ చేసినట్టు మార్క్ చేసేవరకు కొనేవాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. పార్సిల్ On the way అయ్యాక, అంటే దారిలో ఉన్నప్పుడు, వాళ్ళ వైపు Cancel order (ఆర్డర్ రద్దు చేయండి) బటన్ కనిపించదు. ఎందుకంటే పార్సిల్ అప్పటికే బయలుదేరింది. క్యాన్సిల్ అయిన ఆర్డర్ Cancelled ట్యాబ్‌లోకి వెళ్తుంది. వాళ్ళు ఆర్డర్ చేసిన సామాను స్టాక్ దానంతట అదే ప్రోడక్ట్‌కి వెనక్కి వచ్చేస్తుంది.

మీకు ఏం కనిపిస్తుంది

ఆర్డర్ To send ట్యాబ్ నుంచి పోయి, Cancelled కింద కనిపిస్తుంది. అది క్యాన్సిల్ అయిందని, దాన్ని పంపొద్దని చెప్పే నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఆర్డర్ పేజీ తెరిచినప్పుడు అందులో This order was cancelled అని కనిపిస్తుంది. పేజీ అప్పటికే తెరిచి ఉంటే, రీలోడ్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇంకేమీ మారదు. ఆర్డర్ నంబర్, అందులో సామాను, అడ్రస్ అన్నీ అలాగే ఉంటాయి. అందుకే మీరు తర్వాత కూడా దాన్ని తీసి చూసుకోవచ్చు.

అప్పటికే ప్యాక్ చేసి ఉంటే, విప్పేయండి. కొనేవాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు. క్యాన్సిల్ చేసింది వాళ్ళే.

మీ వైపు నుంచి క్యాన్సిల్ చేయడం

షాప్ కన్సోల్‌లో ఆర్డర్ క్యాన్సిల్ చేసే బటన్ లేదు. మీరు ఆర్డర్ పంపలేకపోవచ్చు, సామాను పాడైపోయి ఉండొచ్చు, లేదా కొనేవాళ్ళే చాట్‌లో వద్దని అడగొచ్చు. అలాంటప్పుడు కొనేవాళ్ళకి మెసేజ్ పంపి, వాళ్ళ ఆర్డర్ పేజీ నుంచి క్యాన్సిల్ చేయమని అడగండి. వాళ్ళు చేయలేకపోయినా, చేయకపోయినా, ఆర్డర్ నంబర్‌తో మాకు మెసేజ్ పంపండి. మేము చూసుకుంటాం.

సెల్లర్ కన్సోల్ నుంచి ఎందుకు క్యాన్సిల్ చేయలేరో, సొంత పార్సిల్‌ని డెలివరీ అయినట్టు ఎందుకు మార్క్ చేయలేరో, రెండిటికీ కారణం ఒకటే. డబ్బు కట్టింది కొనేవాళ్ళు, అందుకే ఆర్డర్ ఏమవ్వాలో చెప్పేది వాళ్ళే.

డబ్బు

ఆన్‌లైన్ పేమెంట్లు ఇంకా సెటప్ అవుతున్నాయి. అప్పటివరకు ఏ ఆర్డర్‌పైనా డబ్బు చేతులు మారదు. అందుకే క్యాన్సిల్ అయిన ఆర్డర్‌పై రీఫండ్ చేయడానికి ఏమీ ఉండదు, దానికి మీకు కూడా ఏమీ రాదు.

ఇంకా Sagazoలో అమ్మడం లేదా?

మీ షాప్ ఫ్రీగా తెరవండి

కమిషన్ లేదు, లిస్టింగ్ ఫీజు లేదు, నెలవారీ చార్జీ లేదు. కొన్ని నిమిషాల్లో రిజిస్టర్ చేసి, ఈరోజే మీ ప్రోడక్ట్స్ పెట్టండి.

సెల్లర్ అవ్వండి

మళ్ళీ కనెక్ట్ అవుతోంది…

ఇప్పుడే మళ్ళీ వస్తాం.