నేరుగా ముఖ్య భాగానికి వెళ్ళండి

షాప్‌ని పాజ్ చేయడం లేదా మూసేయడం

అప్‌డేట్ చేసింది

మీ షాప్‌ని పాజ్ చేయాలంటే, కన్సోల్ పైన ఉన్న ఓపెన్, క్లోజ్డ్ స్విచ్ వాడండి. అది Closed అని ఉన్నంతసేపు కొనేవాళ్ళు మీ దగ్గర ఆర్డర్ పెట్టలేరు. పూర్తిగా మూసేయాలంటే, మాకు మెసేజ్ పంపండి, లేదా మీ Sagazo అకౌంట్ డిలీట్ చేయండి. మీకు ఏది కావాలో, మీరు తిరిగి వస్తారా లేదా అనేదాన్ని బట్టి ఉంటుంది.

పాజ్ చేయడం

సెలవుకి, ఇంట్లో పండగ హడావిడికి, లేదా స్టాక్ లేని వారానికి:

  1. మెనూ పైన ఉన్న స్విచ్ నొక్కి Closed (క్లోజ్డ్) అని చూపించేలా చేయండి. ఈ మెనూ, దాంతో పాటు ఈ స్విచ్, కంప్యూటర్ లేదా వెడల్పుగా ఉండే వేరే స్క్రీన్ మీదే కనిపిస్తాయి, ఫోన్‌లో కాదు. కొనేవాళ్ళు ఇక ఆర్డర్ పెట్టలేరు. మీ షాప్ షాప్‌ల లిస్ట్ నుంచి, షాప్ సెర్చ్ నుంచి పోతుంది.
  2. మీ ప్రోడక్ట్స్ కేటగిరీ పేజీల్లో, Shop పేజీలో, ఫీడ్‌లో కూడా కనిపించకూడదంటే, వాటిని స్టాక్ లేదని మార్క్ చేయండి. Products పేజీలో Select all (అన్నీ సెలెక్ట్ చేయండి) నొక్కి, తర్వాత Out of stock (స్టాక్ లేదు) నొక్కండి. ఒక్కో పేజీ చొప్పున చేయండి.
  3. వెళ్ళే ముందు మీ To send (పంపాలి) ట్యాబ్‌లో ఉన్నవన్నీ పంపేయండి. లేదా ఆ కొనేవాళ్ళకి ఎప్పుడు బయలుదేరుతుందో మెసేజ్ పంపండి.

మెనూ పైన ఉన్న స్విచ్ Closed అని చూపిస్తోంది.

తిరిగి వచ్చాక, స్విచ్ నొక్కి Open (ఓపెన్) అని చూపించేలా చేయండి. ప్రోడక్ట్స్‌ని స్టాక్ లేదని మార్క్ చేసి ఉంటే, వాటిని సెలెక్ట్ చేసి Back in stock (స్టాక్ వచ్చింది) నొక్కండి. ఇంకేమీ మారదు: మీ ప్రోడక్ట్స్, ఫోటోలు, రివ్యూలు, కస్టమర్లు అన్నీ మీరు వదిలిన చోటే ఉంటాయి. చూడండి: ఓపెన్, క్లోజ్డ్ స్విచ్‌తో షాప్‌ని పాజ్ చేయడం.

పూర్తిగా మూసేయడం

Close shop (షాప్ మూసేయండి) అనే బటన్ లేదు. షాప్ ఉన్న అకౌంట్ నుంచి మాకు మెసేజ్ పంపండి, షాప్ తీసేయమని చెప్పండి, మేము తీసేస్తాం. ముందు ఇంకా ఆగి ఉన్న ఆర్డర్లు పంపేయండి. ఎందుకంటే డబ్బు కట్టిన కొనేవాళ్ళకి వాళ్ళ పార్సిల్ రావాలి, షాప్ ఏమైనా సరే.

మీ Sagazo అకౌంట్ మొత్తాన్ని అకౌంట్ సెట్టింగ్స్ నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. అది మీ సొంత వివరాలు తుడిచేస్తుంది, షాప్ కూడా దానితో పోతుంది. మీ పోస్ట్‌లు, కామెంట్లు, మెసేజ్‌లు, మీరు పెట్టిన సర్కిల్స్ అలాగే ఉంటాయి, వాటి మీద "[deleted user]" అని కనిపిస్తుంది. దీన్ని వెనక్కి తీసుకోలేరు. చాలామందికి ఇది కావాల్సిన దానికంటే ఎక్కువ. అందుకే షాప్ మాత్రమే పోవాలంటే ముందు మాకు మెసేజ్ పంపండి.

ఏం ఉంటుంది

ఆర్డర్లు మీకూ కొనేవాళ్ళకీ మధ్య రికార్డ్. అందుకే షాప్ మూసేసిన తర్వాత కూడా పాత ఆర్డర్లు కొనేవాళ్ళ హిస్టరీ కోసం ఉంటాయి, మీ పేరు స్థానంలో వేరేది ఉంటుంది. మీరు అమ్మినది ఏదీ కొనేవాళ్ళ ఆర్డర్ పేజీ నుంచి పోదు.

ఇంకా Sagazoలో అమ్మడం లేదా?

మీ షాప్ ఫ్రీగా తెరవండి

కమిషన్ లేదు, లిస్టింగ్ ఫీజు లేదు, నెలవారీ చార్జీ లేదు. కొన్ని నిమిషాల్లో రిజిస్టర్ చేసి, ఈరోజే మీ ప్రోడక్ట్స్ పెట్టండి.

సెల్లర్ అవ్వండి

మళ్ళీ కనెక్ట్ అవుతోంది…

ఇప్పుడే మళ్ళీ వస్తాం.